
నేడు ఎస్సీ సెల్ కార్యనిర్వాహక సమావేశం
సమావేశం జయప్రదం చేయండి
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట పెద చెరువులోని కాసు ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పెద్దలు, రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ, గ్రామ ఎస్సీ సెల్ కార్యవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్యమైన ఎస్సీ సామాజికవర్గ నేతలు పాల్గొంటారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి జరిగిన మేలును గుర్తు చేసుకుంటూనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిద్దామన్నారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సమావేశంలో ఆమోదిస్తామన్నారు.
నరసరావుపేట: పట్టణంలోని పెద్దచెరువు బైపాస్ రోడ్డులో గల కాసు కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం నిర్వహించే వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా కార్యనిర్వాహక సమావేశం జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్
అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు