
మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు
సత్రశాల(రెంటచింతల): ఇంజినీరింగ్ రంగంలో అసాధారణ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహించి మన దేశ ఖ్యాతిని చాటిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం విశ్వేశ్వరయ్య జయంతి నిర్వహించారు. ప్రాజెక్ట్ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతు విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ఇంజినీర్స్ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తి గడించిన విశ్వేశ్వరయ్యను భారత ప్రభుత్వం 1955లో భారత రత్న పురస్కారంతోను, బ్రిటీష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైన బ్రిటీష్ నైట్‌హుడ్‌గా సన్మానించిందన్నారు. మైసూర్ ఆదర్శ నగరంగా మారడంలో ఆయన యనలేదినని కొనియాడారు. హైదరాబాద్, ముంబాయి నగరాలకు డ్రెయినేజి వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్టు ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఈఈ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ ఈఈలు జయశంకర్, గిరిబాబు, మహహ్మద్, మతిన్, ఏఈలు వెంకటరమణ, మల్లేష్, ఏఈఈ శ్రీలత పాల్గొన్నారు.
సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు