
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
తెనాలిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెనాలి బాలాజీరావుపేటలో ఆదివారం చోటుచేకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్, రాధిక దంపతులు కొన్నేళ్లుగా తాపీ పనులు చేసుకుంటూ తెనాలి బాలాజీరావుపేట శివారులో ఉంటున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న వీరిని స్థానికులు గుర్తించి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాధిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు ఘర్షణ పడ్డారని, ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.