
అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
బాపట్ల అర్బన్: బాపట్ల మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో బాపట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెలక్షన్‌న్స్ ఆదివారం జరిగాయి. పోటీల్లో బాలికలు 60 మంది, బాలురు 78 మంది పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన బాలురులో 14 మంది, బాలికలో 14 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 21వ తేదీ వరకు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్యాంపులో పాల్గొంటారు.
21న క్యాంపు ముగించుకొని విజయవాడలో జరిగే అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. మున్సిపల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కత్తి శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ అర్జున్‌రావు, సెక్రెటరీ సుబ్బరాజు, జాయింట్ సెక్రెటరీ మరక సాయికుమార్, ట్రెజరర్ రాధాకృష్ణ, సాప్ కోచ్ శైలజ, పీడీ శ్రావణి, పీడీ మమత, పీడీ లలితమ్మ, పీడీ శాంతికుమారి, బాపట్ల కబడ్డీ క్లబ్ సభ్యులు సాంబశివరావు, నాగులు, నాగేశ్వరరావు, విజయ్, రామాంజిల్‌రెడ్డి, ఊస హరికృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు.