
కబడ్డీ జూనియర్ బాల,బాలికల జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మాబుహుస్సేన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జిల్లా ఎంపికలు సత్తెనపల్లిలోని గుంటూరు రోడ్డులోగల పీఎం రెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్‌లో ఆదివారం జరిగాయి. ఎంపికలకు ముఖ్య అతిథులుగా డీఎన్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దరువూరి నాగేశ్వరావు, ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరావు, విద్యా కేంద్రం జూనియర్, డిగ్రీ కళాశాల డైరెక్టర్ నిమ్మగడ్డ చిట్టిబాబు హజరయ్యారు.
బాలుర జట్టు
వి.అబుత్ కుమార్, జి.తేజ, కె.గోవర్ధనచారి, ఎస్.శివ, రాముడు, వాసు, శ్రీహరి, షేక్.ఆశిక్‌అలీ, వి.రామకృష్ణనాయక్, వెంకట్‌నాయక్, ఎన్.శివరాం, వై.మనీ, ఎం.ప్రసన్న, నాగుల్‌మీరా, సాంబ, ఎ.గోపి, రాఘవ, ఎం.వెంకీ, ఋషి, ఎ.జయప్రకాష్‌లు ఎంపికయ్యారు.
బాలికలజట్టుకు .
ఎం.కావేరి, జె.లక్ష్మి, డి.కృష్ణశ్రీ, కె.దివ్య, కెఎల్.సరిత, ఎల్.నాగమల్లేశ్వరి, పి.తిరుపతమ్మ, జీ.రూప, ఏ.విగ్నేశ్వరి, పీఎస్.స్రవంతి, ఎన్.పుష్పలత, ఏ.భవాని, ఎన్.శ్రావణి, ఎస్.భరిత, ఎస్.అక్షయ, డి.శ్రావణి, జే.నవ్య, డి.అశ్వినిలు ఎంపికయ్యారు. ఎంపికల్లో ఫిజికల్ డైరెక్టర్‌లు పి.శివరామకృష్ణ, రమాదేవి, మెహబూబి పాల్గొన్నారు.