
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్రమ కేసులు బనాయించడం దారుణం
పత్రికా స్వేచ్ఛను హరించడం హేయం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న పత్రికలపై, ఎడిటర్లపై, రిపోర్టర్లపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణం. సాక్షి దినపత్రిక నిజాలను వెలికి తీస్తోందనే అక్కసుతో కూటమి ప్రభుత్వం దారుణాలకు దిగుతోంది. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై, ఇతర విలేకర్లపై కేసులు నమోదు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను దినపత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసిన సాక్షి పత్రికపై అక్కసు వెళ్లగక్కడం మంచి పరిణామం కాదు.
– బొల్లా బ్రహ్మనాయుడు,
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబరు
ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్తంభం. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. ప్రభుత్వ లోపాలు, ప్రజల సమస్యలను తెలియజేసే క్రమంలో వ్యతిరేక వార్తలు రావడం సహజం. వాటిలో తప్పొప్పులను బేరీజు వేసుకోవాలి తప్పా అక్రమ కేసులు బనాయించడం హేయం. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు వంటిది. ఇప్పటికై నా కూటమి సర్కారు తీరు మార్చుకోవాలి.
– మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం దాన్ని కాల రాస్తోంది. సాక్షి మీడియాతో పాటు ఎడిటర్, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తి చూపుతున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికా సేచ్ఛను పరిరక్షించాలి.
–దొంతిరెడ్డి వేమారెడ్డి,
వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త

అక్షరంపై కక్ష సాధింపు తగదు

అక్షరంపై కక్ష సాధింపు తగదు

అక్షరంపై కక్ష సాధింపు తగదు