
రాజీ మార్గమే రాజ మార్గం
సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) విజయ్‌కుమార్‌రెడ్డి
సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), సత్తెనపల్లి మండలం న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భారతదేశ వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా సత్తెనపల్లిలో ఉన్న నాలుగు న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. మూడు బెంచ్‌లుగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఒక బెంచ్‌కి న్యాయమూర్తిగా సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయకుమార్ రెడ్డి, మెంబర్‌గా దివ్వెల శ్రీనివాసరావు, మరో బెంచ్‌కి న్యాయమూర్తిగా ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మెంబర్‌గా న్యాయవాది సూరే.వీరయ్య, మరో బెంచ్‌కి న్యాయమూర్తిగా రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె.సుజిన్‌కుమార్, మెంబర్‌గా గుజ్జర్లపూడి సురేష్‌లు వ్యవహారించారు. జాతీయలోక్ అదాలత్‌లో మొత్తం 504 కేసులు పరిష్కరించారు. వీటి ద్వారా రూ.1,81,33,487 నగదు చేతులు మారాయి. వీటిలో సీవిల్ 75, క్రిమినల్ 425 కేసులు ఉండగా పీఎల్‌సీ నాలుగు కేసులు ఉన్నాయి. కార్యక్రమంలో న్యాయవాదులు అంకాళ్ల వెంకటేశ్వర్లు, సయ్యద్ రహీమ్, పాపారావు, న్యాయవాదులు, బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.