
మొబైల్ మెడికల్ రైలు ప్రారంభం
లక్ష్మీపురం: మొబైల్ మెడికల్ రైలు ఉద్యోగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని గుంటూరు డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ రైలును డివిజన్ వైద్య నిపుణులు లలిత, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రైలులో రైల్వే ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తారన్నారు. పని చేస్తున్న స్టేషన్‌ల వద్దే సేవలు అందుతాయని చెప్పారు. డాక్టర్ సీహెచ్ శ్రీనివాసు, డీఎంవో డాక్టర్ వి.సింధు దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డీఓఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.