
బీచ్ ఫెస్టివల్‌కు అందరు సహకరించాలి
బాపట్ల: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో శనివారం రియల్ ఎస్టేట్, బంగారు నగల వ్యాపారులు, బీచ్ రిసార్ట్ యాజమాన్యం, రైస్ మిల్లర్స్, పెట్రోల్ బంక్, ఎరువులు, విత్తనాల వ్యాపార సంఘ సభ్యులతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26, 27, 28 తేదీలలో సూర్యలంక, రామాపురం బీచ్‌లలో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాలు తిలకించే విధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ వంతు ఆర్థిక సహకారం అందజేయాలని కలెక్టర్ సంస్థల సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మరాజు, ఎం.ఎం.కొండయ్య, ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి