
13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో 13వ తేదీ బుధవారం నుంచి పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తామని ఆలయ ఈఓ రేఖ మంగళవారం తెలిపారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. మొదటి రోజు వేదపండితులచే ఉదక శాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారన్నారు. రెండోరోజు గురువారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చంఢీహోమం మూడవరోజు శుక్రవారం ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహూతి, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
వినుకొండ: ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన నిర్వహించిన సబ్ జూనియర్ మరియు జూనియర్ బాలుర, బాలికల ఎంపికల్లో స్థానిక నరసరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎం.గౌతమ్, బి. వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరప్రసాద్ మంగళవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29న ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీ జోనా నాయక్, ఏటీపీ ఎస్‌కే ఖాశీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 587.20 అడుగులకు చేరింది. ఇది 305.6242 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 5,088, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,542, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 44,271 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 44,271 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఐపీఎస్‌కు ఎంపికై న దోనేపూడి విజయ్‌బాబు
● ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా విధులు నిర్వహణ
● నాలుగో పర్యాయం సివిల్స్ రాసి ఐపీఎస్‌కు ఎంపిక
తెనాలి: పట్టణానికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్‌లను కేటాయిస్తూ యూపీఎస్‌ఈ మంగళవారం తుది ఫలితాలను విడుదల చేసింది. 2021 సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికై న విజయ్‌బాబు, ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్) బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావాలన్న లక్ష్యం కోసం వరుసగా సివిల్స్ పరీక్షలురాస్తూ వచ్చారు. నాలుగో పర్యాయం 681 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు సంతృప్తి లేదన్నారు. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి అయిన తన తండ్రి దోనేపూడి మధుబాబు కోరిక ప్రకారం ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన కలగా విజయ్‌బాబు చెప్పారు. అందుకోసం మరోసారి సివిల్స్ రాస్తానని తెలిపారు.

13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు

13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు

13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు