ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

Aug 5 2025 6:38 AM | Updated on Aug 5 2025 6:38 AM

ప్రార

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

పెదకూరపాడు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. కోటి 50 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయింది. జూలై 18వ తేదీన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చేతుల మీదుగా ఈ రహదారి ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడీ రహదారి కంభంపాడు జలాలపురం మధ్య కుంగిపోయింది. నాసిరకం నిర్మాణానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది.

గారపాడులో పంచలోహ విగ్రహాలు చోరీ

పెదకూరపాడు: గారపాడు గ్రామంలో ఆదివారం పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆలయ అర్చకులు గొట్టుముక్కల ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజల నిర్వహించేందుకు ఆదివారం ఉదయం అర్చకులు తలుపులు తెరవగా స్వామివారి, అమ్మవారి కళ్యాణ పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దక్షిణం వైపు గేటు తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి స్థానికులకు, ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. సీఐ పత్తిపాటి సురేష్‌, ఎస్సై గిరిబాబులు సంఘటన స్థలానికి చేరుకొని సోమవారం విచారించారు. క్లూస్‌ టీం ద్వారా ఆనవాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సురేష్‌ తెలిపారు.

నేడు ప్రభుత్వ

ఉద్యోగుల ఛాయ్‌ పే చర్చ

నరసరావుపేట ఈస్ట్‌: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్‌ ఆవరణలోని క్యాంటీన్‌ వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం చేపడుతున్నట్టు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కే.ఆర్‌.సూర్యనారాయణ, రమేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు చుక్కా వెంకటేశ్వర్లు, కంపాల వెంకటేశ్వర్లు, షేక్‌.బాజీ, ఏ.భాగ్యమేరీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జు సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 586.50 అడుగులకు చేరింది. ఇది 302.9125 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు 5,088, ఎడమ కాలువకు 8,280, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 28,664, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ ఫ్లోగా 44,132 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 66,407 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

లక్ష్మీ నృసింహస్వామి వారికి చైన్‌ బహుకరణ

మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీనృసింహస్వామి వారికి విజయవాడకు చెందిన మండ్రు శ్రీనివాస్‌, భాగ్యశ్రీ దంపతులు రూ.లక్ష విలువైన పింక్‌ కలర్‌ రాయి చైన్‌ను బహూకరించారు. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారికి మంగళగిరి పట్టణానికి చెందిన మానుకొండ వీరభద్రరావు, శివపార్వతి దంపతులు రూ. లక్ష విలువైన తిరునామాలను అందజేశారు.

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు 1
1/4

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు 2
2/4

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు 3
3/4

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు 4
4/4

ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement