
జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. నూతన హాల్‌లో మొదటి క్రైమ్ రివ్యూ సమావేశాన్ని ఐజీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర సమీక్షలు, శాఖాపరమైన అంతర్గత సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహణలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా హాల్ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన హాల్‌లో ప్రారంభ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.