
అట్టహాసంగా పోలేరమ్మ జాతర
బాపట్ల అర్బన్: బాపట్ల పట్టణంలోని రామకృష్ణాపురంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద మూడోరోజు పోలేరమ్మ కొలుపులు సోమవారం ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిషేక మహోత్సవాన్ని వీక్షించడానికి, అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి దూర ప్రాంతాల్లో నివసించే వారితోపాటు చుట్టూ పక్కల గ్రామ ప్రజలు హాజరయ్యారు. పోలేరమ్మ జాతర మహాలక్ష్మి గుడినిపూలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. కోలాట ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సుమారు 20 మంది పాటలతో లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నాదెండ్ల రాంబాబు, పేరాల నాగేశ్వరరావు, కొన్నే వెంకటేశ్వర్లు, నామేపల్లి లక్ష్మీనారాయణ, శంఖవరపు రాంబాబు, పెద్ద వెంకట్రావు, చిన్న వెంకటరావు, మణి, శరత్, మహేష్, వినుకొండ శ్రీను, కొండవీటి శ్రీను,సాంబ, పత్తిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పెద్దలు, చిన్నారుల నృత్యాలు