
షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. బాలుర విభాగంలో 80 మంది, బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోనంకి కిరణ్ కుమార్ తెలిపారు.
బాలుర జట్టుకు: కె. వెంకట్, జి.నవీన్, పి.మోబీన్, బి.రిషి, జి.వెంకటేష్, షేక్.అబ్దుల్, ఎం.హఫీజ్, ఎం.మహీధర్, కె.ప్రవీణ్, జి.మాంజి, కె.సుధీర్, ఎస్.భార్గవ్‌లు ఎంపికయ్యారు.
బాలికల జట్టుకు : యమ్.విజయ పరిమళ, కె.హిమ బిందు, జె.లక్ష్మి కీర్తన, జె.యశస్విని, పి.మేఘన, పి.సుచరిత, ఎం.నందిని, సిహెచ్.అక్షర, కె.హర్షిత, టి.సింధు, ఎం.జ్యోతిక, ఎస్.మధులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్‌దత్తానాయక్, షేక్.మెహబూబి, బి.తులసీరామ్‌నాయక్, ఎ.చిన్నయ్య, తిరుపతమ్మ, రత్నాకర్, యమ్.ప్రసన్న, పి.శివరామకృష్ణ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు.