
జిల్లాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సంక్షేమ రేడు.. పేదల దేవుడు.. అభివృద్ధి ప్రదాత.. ఆరోగ్య దాత.. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా వైభవంగా జరిగాయి. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా.. ఊరు వాడా.. భేదం లేకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి, క్షీరాభిషేకాలు చేసి అభిమానం చాటుకున్నారు. కేకులు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. అన్నదానం.. రక్తదానం.. పేదలకు దుస్తుల పంపిణీ.. వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, రాజన్నా.. నిను మరువలేమన్నా.. అని స్మరిస్తూ.. వైఎస్సార్‌పై తమ గుండెల్లోని ప్రేమను వ్యక్తం చేశారు.
నరసరావుపేట: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
జిల్లా కార్యాలయంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అంధుల పాఠశాలలో అంధులకు అన్నదానం చేశారు. వినుకొండరోడ్డులోని రెడ్డి హాస్టల్‌లో మహానేతకు ఘనంగా నివాళులర్పించి అన్నదానం చేశారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగ జిల్లా కార్యదర్శి అన్నెంపున్నారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా ర్యాలీగా పాల్గొన్నారు.
● చిలకలూరిపేటలో భాస్కర్ సెంటర్‌లో మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి విడదల రజని నివాస ప్రాంతంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. కేకు కటింగ్ చేశారు. పలు వార్డుల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేకులు కట్‌చేశారు. పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ దరియావలి, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండల అధ్యక్షులు దేవినేని శంకరరావు, మంగు ఏడుకొండలు, వడ్డెపల్లి నరసింహారావు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కందుల శ్రీకాంత్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
● పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, గ్రామాల్లో పెద్దఎత్తున వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. క్రోసూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.లగడపాడు గ్రామంలో ముస్లిం యూత్ గ్రామపార్టీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
● మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం, దుర్గి, కారంపూడి, వెల్దుర్తి, మాచర్లరూరల్, పట్టణంల్లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
మాచర్ల పట్టణంలో యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. జమ్మలమడకలో జరిగిన జయంతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
వాడవాడలా వైఎస్సార్‌కు ఘననివాళులు విగ్రహాలకు పూలమాలలు, రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహణ హాస్పిటళ్లలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ మాచర్లలో వైఎస్సార్ సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
సత్తెనపల్లి నియోజకవర్గం కార్యాలయంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి కేకు కట్‌చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తాలూకా సెంటర్, గ్రంథాలయం, 13, 16, 19 వార్డులు, రైల్వేగేటు వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆదరణ, మొల్లమాంబ వృద్ధాశ్రమం, పరివర్తన ఆశ్రమ పాఠశాలలో కేకులు కట్‌చేసి అన్నసంతర్పణ చేశారు. రెంటపాళ్ల, కంటెపూడి, కొమెరపూడిల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. అన్నసంతర్పణ చేశారు. ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకల్లో డాక్టర్ గజ్జల పాల్గొన్నారు. పక్కాల సూరిబాబు, చల్లంచర్ల సాంబశివరావు, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, షేక్ నాగూర్‌మీరాన్, రోళ్ల మాధవి పాల్గొన్నారు.
గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పాల్గొని మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ గురజాల పట్టణం, మండలం, దాచేపల్లి, మాచవరం మండల నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. కేకులు కట్‌చేశారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మినేని వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వినుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. రక్తదానం శిబిరంలో పలువురు రక్తదానం చేశా రు. ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులు, బాలింతలు, పిల్లలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఏనుగుపాలెంరోడ్డు, ముండ్లమూరు బస్టాండ్ వద్ద నున్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, పేదలకు అన్నదానం చేశారు. యోగివేమారెడ్డి సేవాసంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో సంఘ కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అన్నదానం చేశారు. ఎంపీపీలు జయశ్రీ వెంకటరామిరెడ్డి, మేడం జయరామిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, సూరాబత్తుని రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఘనంగా వైఎస్సార్ జయంతి