
ప్రతిపక్షం కాదు...ప్రజాపక్షం
● బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ● కార్యకర్తలకు అండగా వైఎస్సార్‌సీపీ ● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని భవనాశి కల్యాణ మండపంలో సోమవారం ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. మహేష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ క్యూఆర్ కోడ్ విడుదల చేశారన్నారు. ఈ క్యూఆర్ కోడ్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సెల్‌ఫోన్‌లో స్కాన్ చేస్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలు మొత్తం వస్తాయని, వాటిల్లో ఎన్ని హామీలు ప్రజలకు ఇచ్చాడో నేరుగా అడిగి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు మోస పూరిత మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం చంద్రబాబు మేనిఫెస్టోకు సంబంధించిన క్యూఆర్ కోడ్ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్‌తో బాబు మోసాలు బహిర్గతం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడటానికి ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవీ)మాట్లాడుతూ కార్యకర్తలందరు ఐక్యమత్యంతో ఉంటే తమపై ఎవ్వరూ దాడి చేయటానికి ముందుకు రారని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అమరారెడ్డి, ముడేల వెంకటేశ్వరరెడ్డి, మద్దు ప్రసాద్, కొప్పుల సాంబయ్య, ఏలియా కుమారి, గురవారెడ్డి, మందా సుధీర్, వెంకటేశ్వరరెడ్డి, జూలకంటి శ్రీనివాసరావు, పోలు వీరారెడ్డి, యల్లారావు, షేక్ జైలాబ్దిన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.