న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సుందరాచారి | - | Sakshi
Sakshi News home page

న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సుందరాచారి

Jul 8 2025 5:12 AM | Updated on Jul 8 2025 5:12 AM

న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సుందరాచారి

న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సుందరాచారి

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ న్యూరో సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన సీనియర్‌ న్యూరాలజిస్టు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులో అసోసియేషన్‌ 32వ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్‌ సుందరాచారీని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాదిపాటు డాక్టర్‌ సుందరాచారీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కాగా, ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థులు డాక్టర్‌ పి.సాయిలక్ష్మి ఫ్రీ పేపర్‌ ప్రజంటేషన్‌ పోటీల్లో రాష్ట్రంలో మొదటి బహుమతి గెలుపొందారు. డాక్టర్‌ పి.వల్లికృష్ణప్రియ పోస్టర్‌ ప్రజంటేషన్‌ పేపర్‌లో మొదటి బహుమతి గెలుపొందారు. సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు న్యూరాలజిస్టులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్‌సుందరాచారీని అభినందించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుందరాచారీ గెలుపొందిన వైద్య విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఉప్పుటూరి అరుణకుమారి, డాక్టర్‌ గొట్టి పాటి బిందు నర్మద, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement