
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడుగా విష్ణువర్ధన్ ఎన్న
మాచర్ల రూరల్: ఆంధ్రపద్రేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా కోమటి విష్ణువర్థన్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిపినట్లు ప్రస్తుత అధ్యక్షులు ముదిరాజ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొర్నీ నారాయణ ముదిరాజ్ తెలిపారు. ముదిరాజ్ మహాసభ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం వారి సామాజిక భద్రత కోసం జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా అన్నీ పార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని, ఎన్నో ఉద్యమాలు చేసి ముదిరాజ్ జాతి పక్షాన అండగా నిలిచిన చరిత్ర ముదిరాజ్ మహాసభకు ఉందన్నారు. అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అండదండలతో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ జాతి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని జాతి ఉన్నతి కోసం ఎన్నో ఉద్యమాలు, భారీ మహాసభలు నిర్వహించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర శాఖకు తాను అధ్యక్షుడుగా ఎన్నిక కావటం ఆనందకరంగా ఉందని విష్ణువర్ధన్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బొమ్మన సుబ్బరాయుడు ముదిరాజ్, గుడాల సత్యనారాయణ ముదిరాజ్, కోశాధికారిగా బాలబోయిన పాపారావు ముదిరాజ్ ఎన్నికై నట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను సత్కరించారు. కోమటి విష్ణువర్ధన్ ముదిరాజ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ముదిరాజ్ విభాగం అధ్యక్షుడుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. విష్ణువర్థన్ ఎన్నికపై రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.