
వైఎస్సార్ సీపీ హయాంలో ఘనం
జిల్లాలో 60 సొసైటీలు ఉండగా వాటిలో 2.40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం పట్టించుకోక నష్టాల్లో ఉన్న సహకార సంఘాల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ సర్కారు విశేష కృషి చేసింది. రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడం వరకే పరిమితమైన సంఘాల్ని సమూలంగా మార్చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంఘాలను లాభాల బాట పట్టించారు.
● సంఘాల్లో రైల్వే టికెట్ల నుంచి దైవదర్శనం టికెట్ల వరకూ, విద్యుత్ బిల్లుల చెల్లింపులు వంటి అనేక సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
● పెట్రోల్ బంకులు, మల్టీ పర్పస్ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలతో నమ్మకమైన వ్యాపారాలకు శ్రీకారంచుట్టి కొత్త ఒరవడి తెచ్చారు.
● రైతులు పండించిన ఉత్పత్తుల్ని స్థానికంగానే నిల్వ చేసుకునేలా జిల్లాలో 53 మల్టీపర్పస్ గోడౌన్లు, 3 కోల్డ్ స్టోరేజీలు, 3 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశారు.
● జిల్లాలోని శావల్యాపురంలో నిర్మించిన కోల్డ్‌స్టోరేజ్ రాష్ట్రంలోనే సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటైన మొట్టమొదటిది కావడం విశేషం.
● పల్లె ప్రజలకు తక్కువ ధరకే జనరిక్ మందులు లభించేలా ఐదు ప్రధానమంత్రి జనఔషధి కేంద్రాలు నెలకొల్పారు.
● 60 సొసైటీలను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చి, యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్నిరకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిద్వారా సామాన్య పౌరులతో పాటు రైతులకు 300లకు పైగా వివిధ రకాల పౌరసేవలు అందించారు. మెరుగైన భవిష్యత్తు నిర్మాణానికి సహకార సంఘాలు పునాది వంటివని నిరూపించారు.