
అట్రాసిటీ కేసు పూర్వాపరాల పరిశీలన
రాజుపాలెం: మండలంలోని ఇనిమెట్లలో గల ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిమిత్తం సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు శుక్రవారం పరిశీలనకు వచ్చారు. గ్రామానికి చెందిన నాగమ్మ డ్వాక్రా గ్రూపు సభ్యులు అదే గ్రామానికి చెందిన యానిమేటర్ ఎస్‌కె మస్తాన్‌వలిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీని నిమిత్తం సత్తెనపల్లి డీఎస్పీ ఇనిమెట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చేరుకుని నాగమ్మ డ్వాక్రా గ్రూపు సభ్యులను విచారించారు. గ్రూపుకు సంబంధించిన డబ్బులను యానిమేటర్ మస్తాన్‌వలి తమకు సంబంధం లేకుండా కాజేశాడని, ఆ డబ్బుల గురించి అడుగగా మమ్మలను కులం పేరుతో ధూషించాడని చెప్పారు. నోటికొచ్చినట్లు తిట్టడమే గాక మీరు తక్కువ జాతివారు, మాదిగ కులం పేరెత్తి తిట్టాడని డీఎస్పీకి డ్వాక్రా సభ్యులు వివరించారు. వెంటనే స్పందించిన డీఎస్పీ మీరు చెప్పిన వివరాల ప్రకారం మస్తాన్‌వలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ కూచిపూడి రమేష్, నందిగం మరియదాసు, గోవిందు ముత్తయ్య, నాగేశ్వరరావు, నాగమ్మ డ్వాక్రా గ్రూపు లీగర్ నందూరి కుమారి, గోవిందు వీరమ్మ, గుజ్జర్ల ముసలమ్మ, తాళ్లూరి వెంకాయమ్మ, మందా సంతోషమ్మ, తదితరులు ఉన్నారు.