
ఎస్సీ, ఎస్టీలప్రత్యేక పీజీఆర్‌ఎస్
ప్రతినెలా పౌరహక్కుల
దినోత్సవం నిర్వహించాలి
జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామాల్లో ప్రతినెలా చివరి రోజున పౌరహక్కుల దినోత్సవం నిర్వహించేలా తహసీల్దార్లను ఆదేశించండి. అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి.
– చింతిరాల మీరయ్య మాదిగ, కుక్కమూడి ప్రసాదు, ఎమ్మార్పీఎస్, డీబీఎస్‌ఎస్‌ఎన్ నేతలు
నరసరావుపేట: కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షత వహించి 32 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన బాధితులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నా పిల్లలు పొలం అమ్మకుండా చూడండి
నాకు 93ఏళ్లు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశా. వారందరికీ పిల్లలు ఉన్నారు. అయితే నాకు రెండెకరాల పొలం ఉంటే దానిని నా భార్యపేరుపై పెట్టా. ఆ పొలం నా కష్టార్జితం. నేను చిన్నకుమారుడి వద్ద ఉంటా. అయితే నా పొలం అమ్మాలని నా కుమారులు చూస్తున్నారు. నేను దానికి ఒప్పుకోవడం లేదు. ఆ పొలం మొత్తం నా మనవళ్లకు దక్కాలి. వారు ఇబ్బందులు పడకూడదు. పొలం అమ్మటానికి నేను ఒప్పుకోను. పొలం అమ్మకుండా నా పిల్లలను హెచ్చరించండి.
– బండారు అంకాళ్లు,
దేచవరం, నకరికల్లు మండలం
32 అర్జీలు స్వీకరించిన జేసీ సూరజ్

ఎస్సీ, ఎస్టీలప్రత్యేక పీజీఆర్‌ఎస్

ఎస్సీ, ఎస్టీలప్రత్యేక పీజీఆర్‌ఎస్