
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా బొమ
తాడేపల్లి రూరల్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రచార విభాగానికి నూతన ఉపాధ్యక్షులను నియమించారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షులుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాజ గ్రామానికి చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుకి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.