
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతకు సన్మానం
వినుకొండ: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక జాషువా కళాప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ముందుగా పెనుగొండను పట్టణ పురవీధుల్లో ఊరేగించి శివయ్య, గంగినేని, జాషువా విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం కళాప్రాంగణంలో లక్ష్మీనారాయణ దంపతులను ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీహెచ్‌ఎల్‌ఎన్ మూర్తి, సీనియర్ న్యాయవాది పీజే లూకా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.