
అందెల సవ్వడి అలరించగా..
చిలకలూరిపేట: అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలకు లయబద్ధమైన నృత్యరీతులు.. నటరాజ వారసుల అభినయాలు.. కళామతల్లి ముద్దు బిడ్డల మువ్వల సవ్వడుల నడుమ కళానిలయం 40వ జాతీయ స్థాయి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలు పండుగ వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు చిలకలూరిపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణమండపం వేదికగా నిలిచింది. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ నటరాజపూజ, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు పగలు, రాత్రి కొనసాగే ఈ పోటీలలో తొలిరోజు పోటీల్లో భాగంగా సూర్య విభాగంలో 13 సంవత్సరాల లోపు, 14 పైబడిన వారికి రెండు విభాగాలుగా కూచిపూడి నృత్యపోటీలు నిర్వహించారు. శాసీ్త్రయ జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయం కాని జంట నాట్యాలు, శాసీ్త్రయం కాని బృంద నాట్యాలు ప్రదర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముద్దుగారే యశోద, తరంగం, థిల్లానా, అన్నమయ్య కీర్తన, భామాకలాపం, మహిశాసుర మర్థిని వంటి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.
కళలను
ప్రోత్సహించాలి..
పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన నాట్యాచార్యులు దేవరకొండ వెంకట నాగసాయి ముందుమాటలు పలుకుతూ కళలను ప్రోత్సహించండి, కళాకారులను ఆశీర్వదించండి అంటూ కోరారు. కళామతల్లి సేవకు కళానిలయం వ్యవస్థాపకుడు ప్రగడ రాజమోహనరావు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
దశావతారం ప్రదర్శిస్తున్న
హైదరాబాద్‌కు చెందిన పి.ఇఫ్తికారెడ్డి
ప్రారంభమైన కళానిలయం జాతీయస్థాయి సంగీత నాట్య పోటీలు తొలిరోజు కూచిపూడి నృత్యాల ప్రదర్శన
నేటి ప్రదర్శనలు..
కళానిలయం పోటీలలో భాగంగా బుధవారం 13 సంవత్సరాల లోపు చంద్రకేటగిరి ‘బి’ గ్రూపు కూచిపూడి నృత్యాలు, 13 సంవత్సరాల లోపు సూర్య కేటగిరి ‘బి’ గ్రూపు భరతనాట్యం పోటీలు, చంద్ర కేటగిరి ‘బి’ గ్రూపు 13 సంవత్సరాల లోపు భరతనాట్యం పోటీలు, చంద్ర కేటగిరి ‘ఏ’ గ్రూపు 14 సంవత్సరాలు పై బడిన వారికి కూచిపూడి నృత్యాల పోటీలు నిర్వహించనున్నారు. సినీ మధురగీతాలు, శాసీ్త్రయ జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు పోటీలు ఉంటాయి.

అందెల సవ్వడి అలరించగా..

అందెల సవ్వడి అలరించగా..