ఇక డిజిటల్‌గానే పీఏసీఎస్‌ కార్యకలాపాలు | - | Sakshi
Sakshi News home page

ఇక డిజిటల్‌గానే పీఏసీఎస్‌ కార్యకలాపాలు

May 7 2025 2:19 AM | Updated on May 7 2025 2:19 AM

 ఇక డిజిటల్‌గానే పీఏసీఎస్‌ కార్యకలాపాలు

ఇక డిజిటల్‌గానే పీఏసీఎస్‌ కార్యకలాపాలు

నరసరావుపేట: జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)లను ఈపీఏసీఎస్‌లుగా మార్చడం జరిగిందని, దీనివల్ల ప్రతి రోజూ అన్ని కార్యకలాపాలు డిజిటల్‌గా చేయడం జరుగుతుందని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. సహకార సంఘాల కంప్యూటీకరణ చేసిన తర్వాత నిర్వహించాల్సిన ఆడిట్‌పై ఏపీ కో ఆపరేటీవ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రకాష్‌నగర్‌లోని కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలో సహకార శాఖ ఆడిటర్లు, చార్టెట్‌ అకౌంటెంట్‌లు, సీఇవోలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పీఎసీఎస్‌ల ఖాతాలు, లావాదేవీల పరిశీలన, భద్రతా ప్రమాణాలు ఆన్‌లెన్‌ విధానంలో నిర్వహించబడతాయని తద్వారా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. కేంద్రీకృత నిఘా, నియంత్రణ ఉంటుందని, రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి పీఏసీఎస్‌ల పనితీరుపై నేరుగా పర్యవేక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లా సహకార ఆడిట్‌ అధికారి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘ లావాదేవీలు, ఖాతాలు, రికార్డులు స్పష్టంగా ఉండి అవినీతికి అవకాశాలు తగ్గుతాయని, మానవ దోషాలేమీ లేకుండా కంప్యూటరైజ్డ్‌ విధానంలో త్వరగా ఆడిట్‌ పూర్తి చేయవచ్చని అన్నారు. గత ఆడిట్లతో పోలికలు వేయడం సులభమని, మానవ వనరులు, పేపర్‌ వాడకం తగ్గి పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని చెప్పారు. ఇకపై సంఘాలు సభ్యులకు మెరుగైన సేవలు అందించగలవని, తక్కువ సమయంలో ఖాతాలు చూసే రుణ వివరాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ పీఏసీఎస్‌, ఈ–ఆడిట్‌ వ్యవస్థలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని అన్నారు. ఈ ఆడిట్‌ ఎలా చేయాలో సిబ్బందికి, చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌కు శిక్షణ ఇచ్చి వారి సందేహాలను తీర్చారు. సహకార శాఖ ఆడిటర్‌లు, సీఏలు, సీఇఓలు పాల్గొన్నారు.

శిక్షణలో జిల్లా సహకార అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement