పానకం.. ప్రీతికరం | - | Sakshi
Sakshi News home page

పానకం.. ప్రీతికరం

Apr 6 2025 2:36 AM | Updated on Apr 6 2025 2:36 AM

పానకం

పానకం.. ప్రీతికరం

శ్రీరాముని ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యమనే ఆధ్యాత్మిక అంశంతో పాటు వాటిలో మిళితమైన పదార్థాలు ఆయుర్వేద గుణాలు ఉండడంతో ఆరోగ్యాన్నిస్తాయి. వేసవి ఆరంభ కాలంలో వచ్చే శ్రీరామనవమి ఉత్సవంలో ప్రసాదంగా బెల్లం పానకం, వడపప్పును భక్తులకు ప్రసాదంగా అంద జేస్తారు. బెల్లం, మిరియాలు, యాలకులతో తయారు చేసిన పానకంలో ఐరన్‌ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తాయి. సీజన్‌లో వచ్చే గొంతు సంబంధిత సమస్యలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. పెసరపప్పు శరీర వేడిని తగ్గించి చలువ చేస్తుంది. హిందూ వివాహ వేడుకల్లో ఎదిరింపు సన్నాహాల నేపథ్యంలో పానకాల కావిడితో వియ్యాల వారికి స్వాగతం పలకడమనే ఆనవాయితీ శ్రీరామనవమి వేడుకల నుంచే వచ్చిందని అర్చకులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శనివారం అడపా దడపా వర్షం కారణంగా అక్కడక్కడ కాస్త ఇబ్బంది నెలకొన్నప్పటికీ ఉత్సవాలు కొనసాగించనున్నారు.

పానకం.. ప్రీతికరం
1
1/1

పానకం.. ప్రీతికరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement