● పెయింటర్ల ఆవేదన ● ఆధునిక పద్ధతులతో ఉపాధికి గండి ● వృత్తికి స్వస్తి పలుకుతున్న కార్మికులు ● ఇతర ఉపాధి మార్గాలపై దృష్టి
పట్నంబజారు: రంగుల హరివిల్లును అందంగా ఆవిష్కరించే కళాకారులు వారు.. అందమైన బొమ్మలను సుమనోహరంగా తీర్చిదిద్దే అపరబ్రహ్మలు పెయింటర్లు. ఏ శుభకార్యమైనా ఇంటిని రంగులతో అలంకరించాలని కోరుకుంటాం. అభిమాన నాయకుడు, హీరోపై ప్రేమను చాటేలా, దేవుని తిరునాళ్ల సందర్భంగా భక్తిపారవశ్యం ఉప్పొంగేలా బ్యానర్లు కట్టాలని భావిస్తాం. ఈ పనులకు మనకు తొలుత గుర్తొచ్చేది పెయింటర్లే. ఈ వృత్తికి గతంలో బాగా డిమాండ్ ఉండేది. గుంటూరు జిల్లాలో 30వేల మందికిపైగానే పెయింటర్లు ఉన్నారు. గుంటూరు నగరంలో సుమారు 10వేల మందికిపైగా ఉండవచ్చని పెయింటర్ అసోసియేషన్ల అంచనా. అయితే, కొన్నేళ్లుగా వీరి వృత్తి సజావుగా సాగడం లేదు. అధునాతన యంత్రాలతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుండడంతో స్థానిక పెయింటర్ల ఉపాధికి గండి పడుతోంది. ఫలితంగా కుటుంబాలు పోషించుకోలేని దైన్యంలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు.
యాంత్రీకరణతోనే నష్టం
గతంలో సాధారణ ఇంటి నుంచి రెండు, మూడు అంతస్తుల భవనాలు, బహుళ వ్యాపార సముదాయాలకూ పెయింటర్లే రంగులు వేసేవారు. ఫలితంగా ఏడాదిలో ఆరు నెలల పాటు వీరికి పుష్కలంగా పని దొరికేది. అయితే, ఇప్పుడు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. రంగుల నుంచి రకరకాల డిజైన్లను యంత్రాలే వేసేస్తున్నాయి. దీంతో పెయింటర్లకు పని దొరకడం లేదు. అరకొరగా దొరికినా ఉదయం నుంచి చీకటి పడే వరకు రంగులు వేసినా రూ.600 నుంచి రూ. 700 కూలి రావడం గగనమైంది. అది కూడా ఏడాదిలో కేవలం రెండు, మూడు నెలలే పనులు ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణాల సమయంలో రంగులు వేసే పనులను తాపీ మేసీ్త్రలే ఒప్పుకోవడం కూడా పెయింటర్ల జీవనాన్ని దెబ్బతీస్తోంది. దీనికి తోడు కంప్యూటర్‌పై ఫ్లెక్సీలు తయారు చేసే వ్యవస్థ రావటంతో బ్యానర్‌లపై బొమ్మలు, పెయింటింగ్‌లు వేసే పరిస్థితి దాదాపు కనుమరుగైంది.
ప్రత్యామ్నాయం వైపు,,
పనులు లేకపోవడంతో పెయింటర్లు ప్రత్యామ్నాయ వృత్తులవైపు మళ్లుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. రంగుల షాపులు, కిరాణా దుకాణాల్లో గుమాస్తాలుగా చేరుతున్నారు. పూల దుకాణాల్లో కూలీలుగా, బార్లలో వెయిటర్లుగా మారుతున్నారు.
ప్రమాదాలతో..
ఊయలూగుతూ..
వృత్తిని నమ్ముకుని బతుకుతున్నాం
ఎన్నోఏళ్ల నుంచి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్నాం. ఆధునిక యంత్రాల రంగప్రవేశంతో పనులు దొరకడం లేదు. ఆకలి కేకలు తప్పడం లేదు. ప్రభుత్వమే మమ్మలను ఆదుకోవాలి.
– షేక్ బాషా, పెయింటర్
పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయాలి
ఈ వృత్తి ద్వారా కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని రుణాలు మంజూరు చేయాలి. ఈ డబ్బుతో యంత్రాలు కొనుక్కుని జీవనోపాధి పొందుతాం. పింఛన్లు, గృహాలు ఇచ్చి మా సంక్షేమానికి కృషి చేయాలి.
– ఎస్.రాము, పెయింటర్
బహుళ అంతస్తుల భవనాలకు రంగులు వేయడం ఓ సాహసమే. తాళ్ల సాయంతో గాలిలో ఊగుతూ రంగులు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసే క్రమంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. రంగులు వేసే క్రమంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పెయింటింగ్ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఇప్పుడు ఆకలికేకలతో ఆర్తనాదాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కులవృత్తులకు విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ పథకంలో పెయింటర్లను చేర్చకపోవడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెయింటర్ల సంక్షేమానికి కృషి చేయాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
బతుకు భారంగుండె..!
బతుకు భారంగుండె..!