నరసరావుపేటఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలను చేపడుతున్నట్టు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డీఈఓ కె.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బదిలీల నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేస్తామన్నారు. పూర్తిచేసిన బదిలీల దరఖాస్తులను ఈనెల 7వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. సీనియారిటీ లిస్ట్‌ను 10వ తేదీన ప్రకటించి, సిబ్బంది కోరుకున్న విధంగా కౌన్సెలింగ్ నిర్వహించి 12వ తేదీన బదిలీ ఉత్తర్వులు ఇస్తామన్నారు. సిబ్బంది తమ దరఖాస్తులను నిర్ణీత ఫార్మెట్‌లో ఈనెల 7వ తేదీలోగా అందజేయాలని సూచించారు. వివరాలకు 8074499649 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.