రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి మందిరానికి సమీపంలోని పాదాల గుడి వద్ద ఉన్న అమ్మవారి పాద దర్శనం అత్యంత ప్రధానంగా భక్తులు భావిస్తారు. మందిరానికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం పాదాలను దర్శించుకుని వెళ్లడం కనిపిస్తుంది. చైత్రోత్సవాల్లో పాదాలకు విశేష పూజలను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా గురువారం మందిరం ప్రాంగణంలో అమ్మవారి పూజలకు ముందుగా శంకరుని ఆహ్వానించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలు మందిరం ట్రస్టీ రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాస్‌రావు, పెద్దీన వాసు, పాలకొండ ప్రకాష్ దంపతులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం అమ్మవారి పాదాల గుడి వద్దకు ఘటాలను తీసుకువెళ్లడంతో ఉత్సవాలు ముగుస్తాయి.


