జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి కొలార్ గ్రామ పంచాయతీ కెరాపుట్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో గణీపుట్ గ్రామ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన గణీపుట్ గ్రామ టీమ్, కెరాపుట్ టీమ్‌లు గురువారం తలపడ్డాయి. కెరాపుట్ టీమ్ 10 ఓవర్లలో 69 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. 70 పరుగుల విజయ లక్ష్యంతో బేటింగ్ చేసిన గణీపుట్ టీమ్ 9 ఓవర్లలో 70 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బహుమతుల ప్రధాన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా ఆ ప్రాంత ప్రాముఖ క్రీడాకారుడు జగన్నాథ్ నాయక్ హాజరయ్యారు. ఖెరాపుట్ గ్రామం పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్గీయ భాస్కర్ బెరుం జ్ఞాపకార్థం స్మృతి కమిటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. చాంపియన్ టీమ్‌కు రూ.13 వేలతోపాటు షీల్డ్, రన్నర్ టీమ్‌కు రూ.10 వేలు, రన్నర్ షీల్డ్ బహూకరించారు. 50 పరుగులు చేసి గణీపుట్ ఆటగాడు సంజయ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బహుమతుల ప్రధానోత్సవంలో కెరాపుట్ వార్డు మెంబర్ జగన్నాథ్ కుమార్ నాయక్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.


