వాడవాడలా రాష్ట్ర అవతరణ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

వాడవాడలా రాష్ట్ర అవతరణ దినోత్సవం

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

వాడవాడలా రాష్ట్ర అవతరణ దినోత్సవం

జయపురం: జయపురం జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించా రు. ఉత్కళ అవతరణ 90వ వార్షికోత్సవాన్ని పలు సంస్థలు విద్యాలయాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో పవిత్ర ఉత్కళ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంద్రనాయి క్‌, జయపురం సాహిత్య పరిషత్‌ అధ్యక్షులు.. విశ్రా ంత ప్రధాన ఉపాధ్యాయులు హరిహర కరసుధా పట్నాయక్‌, ఎగ్జామినేషన్‌ విభాగ అధికారి ప్రొఫెస ర్‌ రంజన్‌ కుమార్‌ ప్రధాన్‌, డాక్టర్‌ కమళ మహంతి హాజరై రాష్ట్రావతరణ ప్రాముఖ్యతను వివరించారు. ఉత్కళ గౌరవ మహుసూధన దాస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించా రు. ఈ సందర్భంగా మహరిహర కరసుధా పట్నాయక్‌ను వర్సిటీ అధికారులు సత్కరించారు. అలాగే జయపురం తెలుగు సంస్కృతిక సమితి ద్వారా నిర్వహిస్తున్న స్టానిక సిటీ ఉన్నత పాఠశాలలో ఉత్క ళ అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్‌ పట్నాయక్‌ అధ్యక్షత వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement