జయపురం: జయపురం సమితి మొకాపుట్ గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపు రం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొరాపుట్ జిల్లా శిశు సంక్షేమ సమితి అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయత్రీదేవి హాజరయ్యారు. బాల్య వివాహాలు సమాజానికి అనర్థదాయకమన్నారు. బాల్య వివాహాల నిరో ధక చట్టం ప్రకారం 21 ఏళ్ల కన్నా తక్కువ వయసు పురుషుడు, 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న మహిళ వివాహం చట్ట విరుద్ధమని వివరించారు. ఈ శిబిరం యొక్క ప్రధాన లక్ష్యం బాల్య వివాహాల నివారణ, బాధితులకు రక్షణ సహాయం, పునరావాసం కల్పించటం, జాతీయ న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘ఆశా’ కార్యక్ర మం ద్వారా బాల్య వివాహాలను అరికట్టేందుకు సమగ్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్ర మోద్‌కుమార్‌దాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.దివాకర్‌రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజ కిశోర్‌పాయిక్‌రాయ్ పాల్గొన్నారు.


