రక్తదానం సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రక్తదానం సామాజిక బాధ్యత

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

రక్తదానం సామాజిక బాధ్యత

జయపురం: రక్తదానం సామాజిక బాధ్యత అని స్థానిక రోయల్‌ డిగ్రీ కళాశాల ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పాత్రో అన్నారు. సోమవారం రోయ ల్‌ డిగ్రీ కళాశాల, యువ రెడ్‌క్రాస్‌లు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్తహీనులు, క్షతగాత్రులు, గర్భిణుల ప్రాణ రక్షణకు రక్తం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశా పక్షోత్సవాల సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రక్త దా తలకు కళాశాల ప్రిన్సపాల్‌ హరిహర భట్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు. రక్తదాతల మహాసంఘ సభ్యులు నిరంజన్‌ పాణిగ్రహి, బి.గంగాధర్‌, గీతా పండ, అజయకుమార్‌ గౌడ, రవీంద్రకుమార్‌ మి శ్రా, రక్తదాన శిబిర నిర్వాహకులకు పూర్తి సహాయం అందించారు. కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ నాయక్‌ వై ద్య కళాశాల మెడికల్‌ రక్త నిధి సేకరణ టీమ్‌ దాతల నుంచి రక్తం సేకరించారు. ప్రిన్సిపాల్‌ హరిహర భ ట్‌ నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో ఆశిష్‌కు మార్‌ పండా, ప్రతీక్షా మిశ్ర, సుధీర్‌ పండా, సంతో ష్‌ మదలా, శ్వేత ప్రహరాజ్‌, స్మరణికా మిశ్రా, ఎ.సౌజన్య ప్రధాన పాత్ర వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement