గ్యాస్‌ ఏజెన్సీపై చర్య తీసుకోవాలని వినతి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఏజెన్సీపై చర్య తీసుకోవాలని వినతి

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

గ్యాస్‌ ఏజెన్సీపై చర్య తీసుకోవాలని వినతి ● నేడు ఇచ్ఛాపురంలో హోటళ్ల బంద్‌ సక్రమంగా జనగణన

ఇచ్ఛాపురం: వినియోగదారులకు, హోటళ్లకు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వకుండా సమీపంలోని ఒడిశా ప్రాంతానికి తరలించి అధిక మొత్తానికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న స్థానిక గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని శ్రీస్వేచ్ఛావతి హోటల్స్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇచ్ఛాపురం మండల తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి సోమవారం వినతి పత్రం అందజేశా రు. స్థానికంగా ఉన్న హోటళ్ల యజమానులు, సిబ్బంది గ్యాస్‌ ఏజెన్సీ తీరుని నిరసిసూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్ల నిర్వహణ చాలా కష్టతరంగా మారిందన్నారు. దీనికితోడు గ్యాస్‌ ఏజెన్సీవారు కూడా సక్రమంగా సహకరించడం లేదన్నారు. దీనికి నిరసనగా మంగళవారం హోటళ్లను బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.గవర య్య, గౌరవ అధ్యక్షులు యు.తులసయ్యరెడ్డి, కార్యదర్శి జి.హేమకుమార్‌ ప్రతినిధులు, ఎస్‌.శంకర్‌, బబుల్లా, మురళీ, ఆనంద్‌, మోహనరావు, పూర్ణచంద్ర, లక్ష్మణరావు పాల్గొన్నారు.

పలాస: ప్రభుత్వం చేపడుతున్న 2027 జనగణ న కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని పలాస తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తి చెప్పా రు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమ వారం జనగణనపై మండలంలోని ఆర్వోలు, సూపరువైజర్లు, వీఎస్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్‌వో రెన్యూమరేషన్‌ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement