ఇచ్ఛాపురం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు 12వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయు అను బంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్మికులు సోమవారం మున్సిపల్ మస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలి యజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు జీతాలను పెంచి వాటిని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయకుండా అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం 23 నెలలుగా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచా లని కోరారు. మున్సిపల్ కార్మికులు రమేష్, తిరుపతి, లిమ్మాయి, జనార్దన పాల్గొన్నారు.


