రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. మహిళలకు ప్రతిభా పోటీలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. మహిళలకు ప్రతిభా పోటీలు

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

రాయగడ: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం స్థానిక సంస్కృతి భవనంలో ఆదివారం మహిళల మధ్య వంటలు, ముగ్గుల పోటీలను నిర్వహించింది. పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ రంగవళ్లికలతో పాటు పిండివంటల పోటీలకు స్థానం కల్పించారు. పోటీలకు జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సస్మిత బౌరి, మిమాంశు పాండ్య, లయవు మాఝి ,అసిస్టెంట్‌ కలెక్టర్‌ కై లాస్‌ స్వయి, సంగ్రాం నిమ్మల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ సభలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement