● జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
జయపురం: సమాజంలో ఆధ్యాత్మక చైతాన్యాన్ని పెంపొందించటం, ప్రజలలో మనశ్శాంతి కలిగించటం, నైతిక విలువలు బలోపేతం చేయటమే ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థ ప్రధాన లక్ష్యమని మౌంట్ అబూ బ్రహ్మకుమారి ఆశ్రమానికి చెందిన బ్రహ్మకుమారి ఉషాదీది అన్నారు. స్థానిక లాల్‌గుడ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక కొత్తగా నిర్మించిన ఓం శాంతి విశ్వకల్యాణ భవన ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ శాంతి, సమాజ శ్రేయస్సు కోసం ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. బ్రహ్మకుమారి ఉషాదీది ప్రసంగిస్తూ నేడు ప్రారంభించిన నూతన భవనం ప్రపంచ శాంతి, మానవ సంక్షేమానికి అంకితమైన ఆధ్యాత్మిక కేంద్రమన్నారు. ఈ కేంద్రం ద్వారా అన్నివర్గాల ప్రజలకు ధ్యానం, యోగా, ఆధ్యాత్మక చింతన ద్వారా ఆరోగ్యకరమైన, సానుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు మార్గదర్శకం అవుతోందన్నారు. జయపురంలో 39 ఏళ్లుగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. కొరాపుట్ జిల్లాలో 25 శాఖలు పని చేస్తున్నాయని మరో 21 ేసేవా విభాల ద్వారా యువత ప్రగతికి, మహిళల సాధికారత, సామాజిక పురోగతికి నిరంతరం కృషి జరుపుతున్నట్లు పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో పయనించేందుకు యోగా ఎంతో అవసరమన్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో ఒత్తిడితో నిండిన జీవితాలకు శాంతి, మమతలకు ఏకై క మార్గం ఆధ్యాత్మకతేనని అన్నారు. కార్యక్రమంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి హసన్ మధాని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్, నవరంగపూర్, జయపురం ప్రాంతాలకు చెందిన ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


