గాలిలో తుపాకీ పేల్చిన ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

గాలిలో తుపాకీ పేల్చిన ఎమ్మెల్యే

Mar 29 2026 6:51 AM | Updated on Mar 29 2026 6:51 AM

అంగరక్షకుడికి నోటీసులు జారీ

భువనేశ్వర్‌: పవిత్ర శ్రీరామ నవమి పురస్కరించుకుని బొలంగీర్‌ జిల్లా టిట్లాగడ్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే నవీన్‌ జైన్‌ గాలిలోకి తుపాకీ పేల్చిన ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సమగ్ర దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో బట్టబయలైనట్లు సమాచారం. టిట్లాగడ్‌లోని శాస్త్రి స్క్వేర్‌, ఓల్డ్‌ బ్యాంక్‌ స్క్వేర్‌లో వరుసగా 2 సార్లు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తన అంగరక్షకులు మరియు పోలీసు సిబ్బంది సమక్షంలో బహిరంగంగా గాలిలోకి తుపాకీ కాల్చడం కనిపించింది. దీంతో టిట్లాగడ్‌ ఎమ్మెల్యే నవీన్‌ జైన్‌ వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌ఓ)కి బొలంగీర్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం వివరణ కోరుతు నోటీసు జారీ చేసింది. ఎమ్మెల్యే నవీన్‌ జైన్‌ నాటకీయంగా, సినీ శైలిలో తుపాకీ పట్టుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రసారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే పదేపదే గాలిలో తుపాకీ కాల్పులు జరుపుతుండగా, ఆ సమయంలో ఆయన అంగరక్షకుడు స్పష్టంగా సాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా అది బొమ్మ తుపాకీ అని, ఊరేగింపులో పాల్గొన్నవారిని ప్రోత్సహించడానికే తాను కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే నవీన్‌ జైన్‌ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement