వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రారంభం

Mar 29 2026 6:51 AM | Updated on Mar 29 2026 6:51 AM

రాయగడ: స్థానిక హెడ్‌ పోస్టాఫీసు సమీపంలోని సంతోషిమాత మందిరం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంతో పాటు సంపత్‌ గణపతి, విరాట్‌ విశ్వకర్మ, గోవిందమాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వ బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకుడు పొట్నూరు భాస్కరరావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు విఘ్నేశ్వర పూజలతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సాయంత్రం స్థానిక మజ్జిగౌరి మందిరం నుంచి కలశ యాత్రను నిర్వహించారు. యాత్రలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement