పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర అవతరణ వేడుకలు, మహారాజా కృష్ణచంద్ర గజపతి జయంతి సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను గురువారం జిల్లా సాంస్కృతిక, భాష శాఖ నిర్వహించింది. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ఉన్నత, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఒడిశా సాహిత్య అకాడమీ మాజీ సభ్యుడు బిచిత్రానంద బెబర్తా, శులతా శుభదర్శిని, రమాశంకర్ గంతాయత్, చిత్రా రోథో, సుమిత్రా కుమారీ జెన్నా, పద్మిణి కుమారి పండా, సంజుతా నోందో, సురేంద్ర కుమార్ పాత్రో, అనితా దాస్ ప్రముఖ్యలు వ్యవహరించారు.
ఏప్రిల్ ఒకటి ఒడిశా దివాస్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆర్.శెట్టి కాన్పరెన్స్ హాల్‌లో జరుగనున్న వేడుకల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని డి.పి.ఆర్.ఓ తుషార్ సేనాపతి తెలిపారు.


