రాయగడ: ప్రతి నిత్యం ధ్యానం చేయడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆర్యోగానికి ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్ లీజారాణి సతపతి అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల సువర్ణజూబ్లీ సమావేశం హాల్‌లో గత వారం రోజులుగా కొనసాగుతున్న ధ్యానం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సతపతి మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం గంట సమయం ధ్యానం కోసం కేటాయించాలని కళాశాల విద్యార్థినులకు సూచించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. అనంతరం ధ్యానం చేసే విధానాన్ని వివరిస్తూ శిక్షణ కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ తదితరులు పాల్గొన్నారు.


