రాయగడ: స్థానిక జంఝావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయం ప్రాంగణంలో పకాల్ దినోత్సవాన్ని క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వెజ్, నాన్‌వెజ్‌లతో కూడిన కూరల వంటకాలను చేసుకుని చద్దన్నంతో సామూహికంగా తిని ఆనందించారు. చద్దన్నం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఈ సందర్భంగా సందేశాన్ని ఇస్తూ అంతా ఆనందించారు. క్లబ్ అధ్యక్షురాలు అనసూయా మాఝి, ఎంజీఎఫ్ రుడి కుండు, ఉపాధ్యక్షురాలు రేణుబాల పాణిగ్రహి, కోశాధికారి బియలక్ష్మీ మిశ్రోల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.


