జయపురం: జయపురం ఎం.ఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సెమిలిగుడ సమితి దుధారి గ్రామ పంచాయతీలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐఐఎస్‌బ్ల్యూ సునాబెడ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిర్మయి లెంక పాల్గొని నీటి సంరక్షణ, నీటి ప్రాముఖ్యత, శాసీ్త్రయపద్ధతులపై రైతులకు అవగాహణ కల్పించారు. దుధారి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ మహేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. దుదాయి ప్రాంతంలో పెరుగుతున్న నీటి కొరత, నీటి వినియోగ నిర్వహణ, ప్రభుత్వ తాగునీటి సరఫరా, సాగునీటి వనరులు, తదితర విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ లెంక మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి నీటి సంరక్షణలో సమర్థవంతమైన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సంరక్షణకు కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. రిసెర్చ్ సెంటర్ మరో సైంటిస్టు సంతోష్ కుమార్ సాహు మాట్లాడుతూ.. భూగర్భ జల వనరుల సంవరక్షణ, వర్షం నీరు సంవరక్షణ ఎంతో అవసరమన్నారు. మరో అతిథి దీప్తి మయి సాహు మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఎలా వినియోగించాలి, నీటిని ఎలా నిల్వ చేయాలి, తదితర విషయాలను సమగ్రంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దుధారి పంచాయతీలోని గ్రామాల నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గోపీ గొలారి, దిలీప్ కుమార్ సుబుద్ది, ప్రత్యూష్ పాడీ, ఎం.ఎస్.స్వామినాథన్ జయపురం డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ, కార్తీక చరణ్ లెంక పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించారు.


