మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు అటవీశాఖ పరిధిలోని ఎంవి–79 గ్రామం వద్ద శనివారం అటవీ అగ్ని ప్రమాదల నియంత్రణ, వన్యప్రాణి సంరక్షణపై అవగాహన శిబిరం నిర్వహించారు. మోటు అటవీ విభాగం ఆధ్వర్యంలో ఎం.వి 79లో ఉన్న రేంజ్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏసీఎఫ్ మోన్సూన్ ఖేముండూ, రెంజ్ ఆఫీసర్ తనూజా కార్తికి, తపన్ కుమార్ సాహో, మోటు ఫారెస్టర్ మురళీధర్ అనుగులియా, ఫారెస్టర్ దీపంకర్ శివుళి పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల వల్ల చెట్లు, వన్యప్రాణుల నాశనం అవుతాయని తెలిపారు. అందువల్ల స్థానిక ప్రజల సహకారంతో అడవులను అగ్నిముక్తంగా ఉంచేందుకు ఈ అవగహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు, గ్రామస్తుల అడవులను రక్షించేందుకు ప్రతిజ్ఞ చేశారు.


