మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో దారుణం | - | Sakshi
Sakshi News home page

మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో దారుణం

Mar 9 2026 7:15 AM | Updated on Mar 9 2026 7:15 AM

రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనతో తీసుకువచ్చిన ఫినాయిల్‌ను తాగిన అనంతరం ఒంటికి నిప్పు అంటించుకుంది. అది చూసిన మందిరం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి మందిరంలో గల అమ్మవారికి సమర్పించే చీరలను తీసుకువచ్చి ఆమైపె కప్పి మంటలను ఆర్పారు. అనంతరం ఆంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక రైల్వే స్టేషన్‌ ఆర్‌ఎంఎస్‌ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న శుభద్ర మాఝి (32) ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మజ్జిగౌరి మందిరానికి వచ్చి గట్టుపై కూర్చుంది. వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి ఫినాయిల్‌ను అందరూ చూస్తుండగానే తాగింది. బాటిల్‌లో సగం ఫినాయిల్‌ తాగిన ఆమె కొద్ది సమాయానికి అగ్గిపుల్ల వెలిగించి శరీరానికి నిప్పంటించుకుంది. అది చూసిన అక్కడి వారంతా కేకలు వేయడంతో మందిరం సెక్యూటీ సిబ్బంది చేరుకున్నారు. ఒంటికి నిప్పుఅంటించుకుందని గుర్తించి పరుగున వెళ్లి అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను తీసుకువచ్చి ఆమెను కప్పి మంటలను అదుపుచేశారు. స్పృహ కొల్పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి రలించారు. ఆమె స్థానిక ఇందిరానగర్‌ నాలులో లైన్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్డ్డారన్న విషయం తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఫినాయిల్‌ తాగి, ఒంటికి నిప్పు అంటించుకొని మహిళ ఆత్మహత్యాయత్నం

గమనించిన భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది

అమ్మవారికి సమర్పించిన చీరలను కప్పి మంటలను అదుపు చేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement