జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి 26 వ జాతీయ రహదారి చారిగాం కూడలి వద్ద మహేంద్ర వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని చారిగా గ్రామం పితంబర పూజారి(45) గా గుర్తించారు. ప్రమాద విషయం తెలిసిన మృతుని బంధువులు గ్రామస్తులు 26 వ జాతీయ రహదారి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ ముందు మృతదేహంతో బైఠాయించి మృతుని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళన కారణంగా దాదాపు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బొయిపరిగుడ పోలీసు అధికారి రామనాత్ సాహు ఆందోళన కారుల వద్దకు వచ్చి వారితో చర్చలు జరిపి వారిని శాంత పరచటంతో వారు ఆందోళన విరమించారు. సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బొరిగుమ్మ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టు మార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు.


