భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలంలో ఉద్యోగ విరామం పొందిన టికెట్ తనిఖీ సిబ్బందికి సామూహికంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విరామ సిబ్బంది తోటి సిబ్బందితో ఉద్యోగ జీవితంలో తమ అనుభవాలు పంచుకుని కొన్ని మెలుకువల్ని సూచించారు. ఈ సభలో విరామ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్లు (సీటీఐ) బణంబర ముదులి, రమేష్ ప్రధాన్, ఏ. సి. హంసదా, ఎన్. శ్రీనివాస్ రావు మరియు బి సాహు ప్రసంగించారు. స్టేషన్ ఇన్‌చార్జి సునీతా పరిడా అధ్యక్షతన జరిగిన సత్కార కార్యక్రమంలో పూరీ స్టేషన్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ జెనా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమర్షియల్ మేనేజర్ సుశాంత్ కుమార్ సాహు, శ్రామిక్ కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లక్ష్మీ ధర హంతి, శ్రామిక్ యూనియన్ సంస్థాగత కార్యదర్శి రవి శర్మ తదితరులు హాజరయ్యారు.


