అదుపులోకి వచ్చిన పలంక్
భువనేశ్వర్ నగర శివారులో దాదాపు 3 రోజుల పాటు అలజడి రేపిన ఏనుగు పలంక్‌ని అదుపులోకి తీసుకున్నారు. విజయవంతంగా మత్తు ప్రయోగించి దీనిని అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 55 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి మత్తు ప్రయోగం చేసినట్లు వివరించారు. స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసిన ఏనుగు మత్తులోకి వెళ్లిన తర్వాత దీని మెడకు రేడియో కాలర్ అమర్చారు. ఇక నుంచి పలంక్ ప్రతి కదలికను రేడియో కాలర్ పర్యవేక్షిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
– భువనేశ్వర్


