మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

మెట్ర

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

● సామూహిక విద్యా శాఖ మంత్రి పరీక్ష కేంద్రం సందర్శన ● పరీక్ష ఏర్పాట్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో విభాగం కార్యదర్శి

● సామూహిక విద్యా శాఖ మంత్రి పరీక్ష కేంద్రం సందర్శన ● పరీక్ష ఏర్పాట్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో విభాగం కార్యదర్శి

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక హై స్కూల్‌ సర్టిఫికెట్‌ (హెచ్‌ఎస్‌సీ) పరీక్షలు – 2026 ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ) ఆధ్వర్యంలో మార్చి నెల 2 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షల తొలి రోజున రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద్‌ గోండ్‌ స్థానిక యూనిట్‌–1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సౌకర్యాలు తదితర అంశాల్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షార్థుల్ని అభినందించారు. మరో వైపు రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ కమిషనర్‌, సహాయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.తిరుమల నాయక్‌ భువనేశ్వర్‌లోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. కటక్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో సీటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రశ్న పత్రాల పంపిణీ తదితర సౌకర్యాల్ని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సెంటర్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, జిల్లా అధికారులతో మాట్లాడారు. పరీక్ష మార్గదర్శకాలను సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షలను శాంతియుతంగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు సమీక్షించారు. 3082 పరీక్షా కేంద్రాలు ... 5,61,979 మంది విద్యారు్‌ుథ్ల రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థులతో సమగ్రంగా 5 లక్షల 61 వేల 979 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వీరి కోసం అన్ని జిల్లాల్లో మొత్తం 332 నోడల్‌ కేంద్రాలు, 3,082 పరీక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి.

నిఘా కట్టుదిట్టం

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 72 జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 37 బీఎస్‌ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అదనంగా పరీక్షల నిర్వహణ ప్రత్యక్ష పర్యవేక్షణకు, మార్గదర్శకాల కార్యాచరణ పరిశీలన కోసం 3,082 పరీక్షా కేంద్రాలలో ప్రతి దానికీ ఒక్కో పరిశీలకుడిని నియమించారు. పరీక్ష ప్రాంగణాల్లో పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం 1
1/4

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం 2
2/4

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం 3
3/4

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం 4
4/4

మెట్రిక్యులేషన్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement