రూ. 9.9 లక్షల కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ. 9.9 లక్షల కోట్లు

Feb 20 2026 6:47 AM | Updated on Feb 20 2026 6:47 AM

రూ. 9.9 లక్షల కోట్లు

రూ. 9.9 లక్షల కోట్లు

ఒడిశా జీఎస్‌డీపీ ..

భువనేశ్వర్‌: 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర గరిష్ట స్థూల అంతర్గత ఉత్పాదన (జీఎస్‌డీపీ) రూ. 9.9 లక్షల కోట్లు కాగా 7.9 శాతం ఆర్థిక వృద్దిని రాష్ట్రం సాధించిందని రాష్ట్ర ప్రణాళిక – కన్వర్జెన్‌న్స్‌ విభాగం గురువారం విడుదల చేసిన ఒడిశా ఆర్థిక సర్వే 2025–26లో తెలిపింది. అంతకు ముందు 2024–25లో రాష్ట్ర గరిష్ట స్థూల ఉత్పాదన 7.2 శాతం వృద్ధితో 9 లక్షల కోట్లకు పరిమితం కావడంతో ఈ ఏడాది వృద్ధి 9.5 శాతంగా సూచిస్తుంది. ఇది సగటు జాతీయ స్థాయి వృద్ధి 7.4 శాతానికి అధిగమించింది. శుక్రవారం సభలో కొత్త ఆర్థిక సంవత్సరపు బడ్జెటు ప్రవేశ పెట్టే ముందు సభలో ఆర్థిక సర్వేని ప్రవేశ పెట్టారు. ఈ పురోగతికి అన్ని రంగాల బలమైన పనితీరు దోహదపడింది. ప్రైవేట్‌ మరియు ప్రభుత్వ పెట్టుబడుల నుండి రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది. సర్వే నివేదిక ప్రకారం తలసరి ఆదాయం 9.2 శాతం పెరిగి రూ. 1,86,761కి చేరుకుని జాతీయ పెరుగుదల 6.9 శాతంని అధిగమించింది. కార్మిక భాగస్వామ్యం సానుకూలత ఆశాజనకంగా ప్రదర్శించింది. 15 ఏళ్లు పైబడి వయస్సు గల వారి సమగ్ర శ్రామిక భాగస్వామ్య రేటు 2022లో 58.1 శాతానికి పరిమితమై 2024లో 64.5 శాతానికి పెరిగి జాతీయ స్థాయి 59.6 శాతం రేటుని అధిగమించింది. మహిళా కార్మిక భాగస్వామ్యం 37.6 శాతం నుండి 48.7 శాతంకి పెరిగింది. ఇది జాతీయ 40.3 శాతం కంటె అధికం కావడం విశేషం. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆర్థిక వ్యవస్థ పురోగతి 16.8 శాతం కాగా రాష్ట్రంలో ఈ పురోగతి 19.6 శాతం నమోదైంది. 2024–25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 5.2 శాతం వృద్ధితో 150.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. బియ్యం ఉత్పాదన గణనీయంగా 118.6 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. దాదాపు 20 లక్షల మంది రైతుల నుంచి వరి సేకరణ 92.6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి సేకరించారు. వారికి కనీస మద్దతు ధర చెల్లింపు కింద రూ. 21,300 కోట్లు మరియు సాగు పెట్టుబడుల సబ్సిడీ కింద రూ. 7,140 కోట్లు చెల్లించారు. రాగుల సేకరణ రెట్టింపు అయి 8.8 లక్షల క్వింటాళ్లకు చేరుకుంది. రాగులు క్వింటాలుకు రూ. 4,290 కొనుగోలు చేసి క్వింటాలుకు రూ. 210 అదనపు ప్రోత్సాహకం అందజేసింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదన సామర్థ్యం 74.2 లక్షల హెక్టార్లకు విస్తరించింది. వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి చెందాయి. పాల ఉత్పత్తి 3 శాతం పెరిగి 27.1 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకోగా గుడ్ల ఉత్పత్తి 2020–21 నుండి 2024–25లో 14 శాతం వృద్ధితో 406 కోట్ల గుడ్లకు చేరుకుంది. చేపల ఉత్పాదన రంగం గణనీయంగా పుంజుకుంది. ఈ రంగంలో వృద్ధి 6.1 శాతం నమోదై 11.92 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. సముద్ర రొయ్యల ఎగుమతులు రూ. 4,708.1 కోట్లకు పెరిగాయి. పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించింది. 3.35 లక్షల ఉద్యోగాలు అంచనాతో రూ. 5.66 లక్షల కోట్ల విలువైన 244 కొత్త ప్రాజెక్టులు ఆమోదించారు. రూ.1.75 లక్షల కోట్లు పెట్టుబడితో 80 ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి 1.4 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఒడిశా జన్‌ విశ్వాస్‌ బిల్లు 2025 చిన్న నేరాలను నేరరహితం చేయడంతో బీఆర్‌ఏపీ– 2024 కింద వ్యాపార సంస్కరణలు 98 అమలును సాధించాయి. ఫిన్‌టెక్‌ మరియు బ్యాంకింగ్‌ వృద్ధి ఆర్థిక సేవలు 11.9 శాతం వృద్ధి నమోదైంది. కృత్రిమ మేధ ఏఐ విధానం – 2025, జీసీసీ పాలసీ – 2025, సెమీకండక్టర్‌ – ఫ్యాబ్‌లెస్‌ పాలసీ, 2025 వంటి విధానాలు డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఓడ రేవుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. జాతీయ కార్గో రంగంలో పారాదీప్‌ ఓడ రేవు 18 శాతం వాటాను కలిగి ఉంది. రైల్వేలు 200 కిలో కొత్త లైన్లు జోడింది 3,243 కిలో మీటర్లకు నెట్‌వర్క్‌ విస్తరించింది. విమానయాన రంగం గణనీయంగా పుంజుకుంది. ప్రయాణికుల రవాణా 31 శాతానికి పెరిగింది. రాష్ట్రం క్రీడారంగంలో వెలుగొందుతుంది. రాష్ట్రం 2025లో ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌, ఐటీటీఎఫ్‌, ఏటీటీఎఫ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ల వంటి ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌లతో పాటు ఆల్‌–ఇండియా పోలీస్‌ హాకీ చాంపియన్‌షిప్‌, సీనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ల వంటి కీలక జాతీయ టోర్నమెంట్‌లను నిర్వహించింది. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, ఇండోర్‌ క్రీడా వేదికలు సహా అన్ని వర్గాలలో సమగ్ర క్రీడా సౌకర్యాల మెరుగుదలకు 2025–26లో రాష్ట్ర క్రీడలు, యువజన సేవల విభాగం రూ.1,319 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement